ఎన్టీఆర్ అమ్మ అంటూ పిలిచే ఏకైక నటి ఎవరో తెలుసా ?

ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత చాలామందితో చాలా రకాలైన అనుబంధాలను పెంచుకున్నారు.ఒక పట్టానా మనుషులని దగ్గరికి రానిచ్చేవారు కాదు.

 Ntr Called Pundari Bhai As Mother Details, Ntr, Sr Ntr, Nandamuri Taraka Ramarao-TeluguStop.com

కానీ ఆయనకు దగ్గరగా ఒక్కసారి బంధాన్ని పెనవేసుకుంటే మాత్రం చచ్చేవరకు అది కొనసాగేది.అందుకే అన్నగారికి అతి తక్కువ మందితో గాఢమైన బంధాలు ఉండేవి.

ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిత్తూరు నాగయ్య గురించి.తొలి తరం హీరో అయిన నాగయ్యను ఎన్టీఆర్ తన గురువుగా భావించేవారు అంతేకాదు ఆయనను నాన్న అని కూడా సంబోధించేవారు.

ఎన్టీఆర్ తో పాటు అక్కినేని నాగేశ్వరరావు సైతం నాగయ్యను సొంత తండ్రిలాగే అభిమానించేవారు.గురు శిష్యుల అనుబంధం కంటే కూడా వీరి మధ్య గొప్ప అనుబంధం పెనవేసుకొని ఉండేది.

గయ్యాళి అత్త పాత్రలో నటించిన సూర్యకాంతాన్ని ఆయన ముద్దుగా అత్తా అని పిలిచేవారు ఆమె చనిపోయే వరకు కూడా ఎన్టీఆర్ సూర్యకాంతం ని అత్త అనే పిలిచారు.ఇక సావిత్రితో సైతం ఆయన ఒక సోదరి భావాన్ని కలిగి ఉండేవారు.

ఆమె హీరోయిన్ గా ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో నటించినా కూడా సావిత్రమ్మ అంటూ ఆమెను ఒక చెల్లిలాగా చూసుకునేవారు కూడా.

Telugu Actresspundari, Gajadonga, Mother, Nandamuritaraka, Ntr Pundari Bai, Pand

ఇక ఆయన అమ్మగా పిలిచే వ్యక్తి కూడా ఇండస్ట్రీలో ఉన్నారు ఆమె మరెవరో కాదు పుండరీ బాయి. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి రావడానికి ముందే ఆమె తొలి తరం హీరోయిన్ గా పనిచేశారు.ఇక ఎన్టీఆర్ కి తల్లిగా దాదాపు 30 సినిమాల వరకు ఆమె కనిపించారు.

నిండుగా చీర కట్టుకుని ఉండే ఆమెని చూస్తే ఎవరైనా కూడా చేతులెత్తి నమస్కరించి అమ్మ అని పిలవాలనిపించేంత నిండతనంగా ఉంటుంది.

Telugu Actresspundari, Gajadonga, Mother, Nandamuritaraka, Ntr Pundari Bai, Pand

అందుకే సినిమాలో నటిస్తున్నప్పుడు మాత్రమే కాకుండా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా పుండరీ బాయి ని ఎన్టీఆర్ అమ్మ అని సంబోధించేవారు.ఇక పాతాళభైరవిలో తల్లి కొడుకులుగా ఎన్టీఆర్ పుండరీబాయిలను చూస్తే నిజమైన బంధాలు కలిగి ఉన్న వారి లాగానే అనిపిస్తారు.అంతలా వారు సినిమాను ప్రభావితం చేసేవారు.

గజదొంగ సినిమాలోని వీరిద్దరూ తల్లి కొడుకులుగా కనిపించి ఔరా అనిపించారు.ఇలా ఇండస్ట్రీలో అమ్మ నాన్న చెల్లి అంటూ అనేక బంధాలు కలిగి ఉన్న వ్యక్తి కేవలం ఎన్టీఆర్ మాత్రమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube