టాలీవుడ్ జక్కన్న రాజమౌళి మరో సూపర్ డూపర్ హిట్ సినిమా ను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.బాహుబలి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అవ్వగా ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో సక్సెస్ అయింది.
ఇప్పటికీ కూడా సినిమా భారీ ఎత్తున సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతోంది.ఆస్కార్ వరకు వెళ్లిన ఈ సినిమా తో జక్కన్న రాజమౌళి కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.
అందుకే ఆయన తో పలు హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చాయట.ఇప్పటికే మహేష్ బాబు తో సినిమా ను కమిట్ అయ్యి ఉన్న రాజమౌళి ప్రస్తుతానికి ఏ ఒక్క ఆఫర్ ని కూడా అంగీకరించలేదని తెలుస్తుంది.
ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ వారు ఏకంగా 100 కోట్ల ఆఫర్ తో రాజమౌళి ముందుకు వచ్చారట.ఇంగ్లీష్ లేదా ఏదైనా భాష లో వెబ్ సిరీస్ తెరకెక్కించేందుకు ఆయన కు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆయన కోరినంత బడ్జెట్ కూడా ఇచ్చేందుకు వారు ఓకే చెప్పారు.అంతటి ఆఫర్ ని కూడా రాజమౌళి తిరస్కరించారని తెలుస్తుంది.
మహేష్ బాబు తో సినిమా పూర్తి అయిన తర్వాతే ఏదైనా ప్రాజెక్టు అన్నట్లుగా రాజమౌళి తన వద్దకు వచ్చిన అవకాశాలన్నింటిని కూడా పక్కకు నెట్టి వేసినట్లుగా సమాచారం అందుతుంది.

ఇప్పటి వరకు రాజమౌళి తదుపరి సినిమా కు సంబంధించి పనులు ప్రారంభించిన దాఖలాలు కనిపించడం లేదు.వచ్చే ఏడాది లో సినిమా యొక్క ఫ్రీ ప్రొడక్షన్ వరకు షురూ అయ్యే అవకాశం ఉంది.మహేష్ బాబు సినిమా షూటింగ్ జరగడానికి చాలా సమయం పట్టింది అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం.
ప్రస్తుతం రాజమౌళి దృష్టి అంతా కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ను ఆస్కార్ లో నిలబెట్టడమే.మరి అది సాధ్యం అయ్యేనా చూడాలి.







