సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ నటీనటులకు ఉండే అభిమానులు అంతా ఇంతా కాదు.అభిమానులు తమ అభిమాన హీరో హీరోయిన్ లపై చూపించే ప్రేమ, అభిమానం మాత్రం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.
ఇక వారి సినిమాలు విడుదలవుతుందంటే చాలు థియేటర్ల ముందు పెద్ద పెద్ద బ్యానర్లతో తమ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు.ఇక వారి పుట్టినరోజు వేడుకలు ఉంటే మాత్రం రక్తదానాలు, అన్నదానాలు చేస్తూ అభిమానాన్ని చాటి చూపిస్తారు.
అలా కేవలం తమ అభిమాన హీరో పైనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా మంచి అభిమానం చూపిస్తారు.ఇక వారికి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేక పోతారు.
అలాంటిదే టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ కి కూడా ఉంది.రామ్ చరణ్ కు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానం ఉంది.
కేవలం రామ్ చరణ్ కే కాకుండా ఆయన కుటుంబ సభ్యులు అంటే కూడా బాగా అభిమానం చూపిస్తారు తెలుగు రాష్ట్రాల ప్రజలు.రామ్ చరణ్ భార్య ఉపాసన పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు.
వదినమ్మ అంటూ ఆప్యాయంగా పిలుస్తారు.వారికి ఏమైనా అయితే అసలు తట్టుకోలేక పోతారు.

తాజాగా ఉపాసన విషయంలో కూడా రామ్ చరణ్ అభిమానులు అసలు తట్టుకోలేకపోతున్నారు.ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.రామ్ చరణ్ భార్య ఉపాసన తెలుగు రాష్ట్రాలలో మంచి అభిమానం సంపాదించుకుంది.కేవలం మెగా కోడలు గానే కాకుండా అపోలో వైస్ చైర్మన్ గా కూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన.
ఉపాసన వ్యక్తిగతం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే ఆమె అంత మంచి మనస్తత్వం కలదు కాబట్టి.
రామ్ చరణ్ మంచి హోదాలో ఉన్న సమయంలో ఉపాసనను ప్రేమించి పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు.పెళ్లి తర్వాత చూడముచ్చటగా ఉన్న ఈ జంటను చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

ఒకరి పై ఒకరు చూపించే ప్రేమను మాత్రం అంతా ఇంతా కాదు.ఇక ఈ జంట పెళ్లి చేసుకొని పదేళ్లు పూర్తవగా ఇటీవలే తమ అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు.త్వరలో తాము అమ్మ నాన్న కాబోతున్నామంటూ తెలిపారు.దీంతో ఇంతకాలం చరణ్ వారసుడు కోసం ఎదురుచూసిన అభిమానులకు ఇది తీపి కబురుగా అందింది.అప్పటినుంచి రామ్ చరణ్ అభిమానులు తమ వదినమ్మ ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా జాగ్రత్తలు చెబుతున్నారు.అయితే తాజాగా ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటో పంచుకుంది.
ఇందులో తను జంక్ ఫుడ్ తీసుకుంటూ కనిపించింది.అంతే కాకుండా ప్రెగ్నెన్సీ క్రెవింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
అయితే ఆ ఫోటోని చూసిన తన అభిమానులు ఉపాసన తీసుకునే ఆహార పదార్థం పై ఆందోళన చెందుతున్నారు.ఇక ఓ అభిమాని మాత్రం.
వదినమ్మ ఏది పడితే అది తినకండి లోపల జూనియర్ రామ్ చరణ్ కి పడతాయో లేదో అంటూ కామెంట్ పెట్టారు.ప్రస్తుతం ఆ కామెంట్ వైరల్ అవుతుంది.







