యంగ్ రెబల్ స్టార్ గా మన టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు డార్లింగ్ ప్రభాస్.ఇక బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.అందుకే ఈయన సినిమా అప్డేట్ అంటే పాన్ ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంది.
ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కే ఒకటి.ఈ సినిమా పాన్ వరల్డ్ గా తెరకెక్కుతుంది.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
మరి పాన్ వరల్డ్ సినిమా అంటే కంటెంట్ కూడా అదే లెవల్ లో ఉండాలి.కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమా కంటెంట్ గురించి నాగ్ అశ్విన్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
అందుకే ఈ సినిమా నుండి ఏ చిన్న అప్డేట్ వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు.అయితే ప్రభాస్ పుట్టిన రోజుకు పెద్ద అప్డేట్ ఇస్తాడు అని ఎదురు చుస్తే.
జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేసాడు.కనీసం టైటిల్ కూడా రివీల్ చేయక పోవడంతో ఎప్పుడెప్పుడు అప్డేట్ ఉంటుందా అని చూస్తున్నారు.
అయితే ప్రెజెంట్ ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ విషయంలో క్లారిటీ రాలేదు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారని.అయితే అది 2023 ఫిబ్రవరి లేదా మార్చి లోనే అఫిషియల్ గా రివీల్ చేస్తారు అని టాక్ వస్తుంది.2025లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.ఇక వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, మరొక బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తున్నారు.