మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావు టార్గెట్ గా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.అహంభావంతో తాను ఎక్కడా పని చేయలేదన్నారు.
కొంతమంది తప్పుడు పద్ధతిలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.గతంలో ఎప్పుడైనా సత్తుపల్లిలో ఇలాంటి అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు.సత్తుపల్లికి రూ.60 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు చెప్పారు.







