పుష్ప2 సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ విషయంలో గతేడాది నుంచి ఎన్నో కథనాలు ప్రచారంలోకి వస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను అంతకంతకూ పెంచేస్తున్నాయి.అయితే పుష్ప2 సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.పుష్ప2 మూవీకి బన్నీ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయలు అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా లాభాల్లో బన్నీకి 30 శాతం వాటాగా దక్కనుందని సమాచారం.
హిందీ హక్కుల నుంచి భారీ మొత్తం వచ్చే అవకాశం ఉండటంతో బన్నీ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా.బన్నీకి పారితోషికం, లాభాలతో కలిపి ఏకంగా 130 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రెమ్యునరేషన్ విషయంలో ఈ లెక్కల ప్రకారం బన్నీనే నంబర్ వన్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
బాహుబలి2, కేజీఎఫ్2 సినిమాల సక్సెస్ నేపథ్యంలో పుష్ప2 కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పుష్ప2 సినిమాలో సాయిపల్లవి నటిస్తారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టత వచ్చేసింది.పుష్ప2 బడ్జెట్ విషయంలో మైత్రీ నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడటం లేదు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు టాలీవుడ్ ఇండస్ట్రీలోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్నారు.బన్నీ నిదానంగానే సినిమాలు చేస్తున్నా ప్రతి సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బన్నీ పుష్ప2 మూవీతో ఏ స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.పుష్ప2 సినిమాపై రష్మిక కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు.ఇతర ఇండస్ట్రీలతో పోల్చి చూస్తే సౌత్ లోనే రష్మికకు అంతోఇంతో ఆఫర్లు వస్తున్నాయి.రష్మికకు క్రేజ్ మరింత పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.