టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఒక టాక్ షో కి వెళ్లడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఆ షో మరేదో కాదు బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరైన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించిన ప్రోమోలు విడుదల కావడంతో అభిమానులు సందడి సందడి చేస్తున్నారు.అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఆ పూర్తి ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
బాలయ్య బాబు వేసే పంచులకు పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వినట్టు తెలుస్తోంది.
సరదా సరదాగా నవ్విస్తూనే మధ్య మధ్యలో బాలయ్య బాబు రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలను కూడా అడుగుతూ తనదైన శైలిలో సమాధానం రాబట్టారు.
ఈ నేపథ్యంలోనే అందరూ అనుకున్న విధంగానే బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రశ్నను వేశారు..ఆ ప్రశ్న పై స్పందించిన పవన్ కళ్యాణ్ హేటర్స్ కు బుద్ధి వచ్చే విధంగా గట్టిగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.తాను కావాలని చేసింది కాదని, తనకు రిలేషన్ సెట్ అవ్వదు అని తెలిసినప్పుడు ఇద్దరి అభిప్రాయంతోనే విడిపోయినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.
అంతే కాకుండా ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే మరొకరిని పెళ్లి చేసుకోవడంతో పాటు వారు అనుమతితోనే విడిపోయినట్టు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన బాలయ్య బాబు కూడా హేటర్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఒకరి పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయడం ఈజీ, కానీ వారు ఎంతలా బాధపడతారు అన్నది అర్థం చేసుకోవాలని, అటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వారి కుటుంబం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలిపారు బాలయ్య బాబు.దాంతో స్టేజి మొత్తం బాలయ్య బాబు నినాదాలతో మారు మోగిపోయినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.







