మీరు గూగుల్ పే వాడుతున్నారా? అయితే రూ.8 లక్షల వరకు రుణం పొందొచ్చు?

గూగుల్ పే గురించి తెలియని జనాలు గ్లోబ్ పైనే ఉండరని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.ఇక్కడ అనేకమంది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రుణాలు తీసుకొని ఆ తరువాత నానా ఇబ్బందులకు గురవుతుంటారు.

 Are You Using Google Pay But Can You Get A Loan Up To Rs.8 Lakh , Google Pay, Go-TeluguStop.com

ఇటీవల ఇలాంటి కేసులను చాలా చూసాం.ఈ క్రమంలో చాలామంది సూసైడ్ చేసుకోవడం కూడా మనకి తెలుసు.

అయితే అలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఇపుడు గూగుల్ పే ద్వారా కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆర్థిక ఇబ్బందులతో మీరు సతమతం అయినపుడు, వేరే ఆప్షన్ లేనపుడు దీనిని ఆశ్రయించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

దీనిద్వారా సులభంగా లోన్ తీసుకోవచ్చు.

బ్యాంక్‌కు వెళ్లాల్సిన పని కూడా ఉండదు.అయితే అదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? సాధ్యమే.గూగుల్ పే ద్వారా లోన్ పొందొచ్చు.అయితే ఇక్కడ గూగుల్ పే నేరుగా రుణాలు ఇవ్వదు.ఫైనాన్స్ కంపెనీలు గూగుల్ పేతో భాగస్వామ్యం కుదుర్చుకొని వారి భాగస్వామ్యంతో లోన్స్ అందిస్తుంది.అంటే మీరు గూగుల్ పే యాప్‌లోకి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చన్నమాట.

Telugu Financial Tips, Google Pay, Google Pay Loan, Loan Offers, Personal Loan-L

దానికోసం మీరు ముందుగా గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి.అక్కడ మేనేజ్ మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది.ఇందులో క్రెడిట్ కార్డు, లోన్స్, గోల్డ్ అనే ఆప్షన్లు మీకు కనిపిస్తున్నాయా? వీటిల్లో లోన్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.ఇప్పుడు లోన్ ఆఫర్లుపై క్లిక్ చేసి మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవాలి.DMI ఫైనాన్స్ లోన్ ఆప్షన్ కనిపిస్తుంది.స్టార్ట్ లోన్ అప్లికేషన్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలు అందిస్తే సరిపోతుంది.అర్హత కలిగిన వారికి రుణం వెంటనే లభిస్తుంది.

దానికోసం పాన్ కార్డు వివరాలు, అడ్రస్, ఆధార్ వంటి తదితర సమచారం అందించాల్సి ఉంటుంది.కాగా ఇటువంటి రుణాలపై వడ్డీ రేటు 15 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.కనీసం రూ.10 వేలు గరిష్టంగా రూ.8 లక్షల వరకు లోన్ పొందొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube