ఒకప్పుడు మాస్ రాజా సినిమాలు అంటే బాగా క్రేజ్ ఉండేది.కానీ ఇప్పుడు అలా కాదు.
తాను మెల్లగా ఫామ్ కోల్పోతున్నాడు అనుకున్న సమయానికి మళ్ళీ హిట్ అందుకుంటున్నాడు.అయితే ఓక్ హిట్ పడింది అనుకుంటే మరో రెండు ప్లాప్స్ వస్తున్నాయి.
క్రాక్ వంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత మళ్ళీ వరుసగా రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.
ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రెండు కూడా భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి.
దీంతో నెక్స్ట్ సినిమా విషయంలో మాస్ రాజా ఫ్యాన్స్ మళ్ళీ ప్లాప్ అవుతుందేమో అని కంగారు పడ్డారు.అయితే ఈసారి మాత్రం రెండు డిజాస్టర్స్ ను మరిపించే హిట్ అందుకున్నాడు.
ఆ సినిమానే ధమాకా.
రవితేజ హీరోగా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ‘ధమాకా’.
రెండు డిజాస్టర్స్ తర్వాత మాస్ రాజా ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు.
భారీ అంచనాలతో ధమాకా సినిమా డిసెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

19 కోట్ల టార్గెట్ తో రవితేజ బరిలోకి దిగాడు మాస్ రాజా.ధమాకా మొదటి రోజునే సాలిడ్ వసూళ్లు రాబట్టింది.దాదాపు 30 కోట్లను క్రాస్ చేసిన ఈ సినిమా నాలగవ రోజు సోమవారం టెస్ట్ కూడా పాస్ అయ్యింది అనే చెప్పాలి.దీంతో ఈ భారీ రెస్పాన్స్ ను పంచుకుంటూ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వీక్ డే సోమవారం కూడా మొదటి రోజు నాటి సాలిడ్ రెస్పాన్స్ అందుకున్నట్టు మేకర్స్ చెబుతూ సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేసారు.







