దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.BF 7 అనే సబ్ వేరియంట్ వేగంగా విస్తరిస్తూ ఉంది.
చైనాలో ఈ వేరియంట్ కారణంగా రోజుకి కొన్ని కోట్లల్లో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి.అక్కడి ప్రభుత్వం చేతులెత్తేయడంతో పరిస్థితులు చాలా దారుణంగా మారాయి.
ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తి విషయంలో అప్రమత్తమయ్యింది.ఇప్పటికే ప్రధాని మోడీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
కరోనా కట్టడికి సంబంధించి అనేక విషయాలలో తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఇలాంటి తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను మళ్లీ తెరపైకి తీసుకురావడం జరిగింది.
స్కూల్ మరియు కాలేజీలు ఇంకా సినిమా ధియేటర్ లలో మాస్క్ లు తప్పనిసరి చేశారు.కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్ ఈ ప్రకటన చేశారు.

అంతేకాదు నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా పబ్ లు, రెస్టారెంట్ లు, బార్ లలో కచ్చితంగా మాస్క్ లు ధరించాలని… న్యూ ఇయర్ వేడుకలు రాత్రి ఒంటిగంటలోపే ముగించాల్సి ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది.అంతేకాదు వేడుకలు జరిగే ప్రతి స్థలంలో పరిమితికి మించి జనం గూమి కూడ రాదని కూడా తెలియజేశారు.ఈ కొత్త వేరియంట్ కి భయపడాల్సిన అవసరం లేదని ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి కేశవ సుధాకర్ పేర్కొన్నారు.







