టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది.
దీంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ అందుకు సంబంధించిన చికిత్సను తీసుకుంటోంది.అయితే సమంత నటించిన యశోద సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అదేమిటంటే తాజాగా సమంతకు ప్రముఖ నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఒక మంచి సందేశం తో ఉన్న ఫోటోని బహుమతిగా ఇచ్చారు.
అదే విషయాన్ని సమంత సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ అతనికి కృతజ్ఞతలు తెలిపింది.
అందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సమంతను ఉక్కు మహిళగా అభివర్ణించిన రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు.కానీ త్వరలోనే అది ప్రకాశిస్తుంది.
ప్రస్తుతం నీ శరీరంలో కదలికలు కష్టంగా ఉండవచ్చు.కానీ త్వరలోనే అన్ని బాగుంటాయి.
అంటే నువ్వు ఉక్కు మహిళవి విజయం నీ హక్కు.నువ్వు ఒక యోధురాలివి.
నిన్ను ఏది ఓడించలేదు.ఇలాంటివి నిన్ను ఇంకా బలపరుస్తాయి.
ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయి అని రాసి ఫోటోను సమంతకు కానుకగా ఇచ్చారు.అందుకు సంబంధించిన ఫోటోని షేర్ చేసిన సమంత కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితం.

పోరాడుతూనే ఉండండి అప్పుడే గతంలో కంటే మరింత బలంగా తయారవుతారు అని రాసుకొచ్చింది.అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవ్వడంతో అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.ఆ పోస్ట్ చూసిన అభిమానులు అందులో ఉన్న పదాలు సమంత కచ్చితంగా సరిపోతాయి అంటున్నారు.కాగా సమంత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇప్పటికే అందులో విజయ్ దేవరకొండకు సంబంధించిన సన్నివేశాలు అన్నీ పూర్తికాగా సమంతకు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేయడం మాత్రమే మిగిలి ఉన్నాయి.సమంత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ షూటింగ్ వాయిదా పడుతూనే వస్తోంది.







