ప్రెజెంట్ మన టాలీవుడ్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది.మన ఇండస్ట్రీలో తెరకెక్కబోయే భారీ పాన్ ఇండియా సినిమాలకు పక్క ఇండస్ట్రీల నుండి స్టార్ నటులను కీలక పాత్రల కోసం ఎంపిక చేస్తున్నారు.
ఎందుకంటే పాన్ ఇండియా వ్యాప్తంగా మన సినిమాలకు క్రేజ్ ఏర్పడడం కోసం మేకర్స్ అలా చేస్తున్నారు.అందులోను మన టాలీవుడ్ మూవీ అంటే పక్క బాషల స్టార్ నటులు సైతం వెంటనే ఒప్పేసుకుంటున్నారు.
మన టాలీవుడ్ కు పెరిగిన డిమాండ్ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్స్ సైతం మన సినిమాల్లో నటించడానికి సై అంటున్నారు.ఇక తాజాగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా NTR30 లో కూడా ఒక బాలీవుడ్ హీరో నటించ బోతున్నాడు అని అది కూడా విలన్ పాత్రలో అని తెలుస్తుంది.
మరి ఆ స్టార్ హీరో ఎవరో కాదు.బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్.
ఈయన ఇప్పటికే ప్రభాస్ ఆదిపురుష్ లో రావణాసురుడి పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఇప్పుడు కొరటాల, ఎన్టీఆర్ ప్రాజెక్ట్ లో కూడా ఈయన విలన్ గా నటిస్తున్నాడు అని టాక్ వస్తుంది.
మొన్నటి వరకు ఈ పాత్రలో సంజయ్ దత్ పేరు వినిపించింది.అయితే ఈ పాత్ర చాలా ఉంటుందట.
అందుకే ఈయనను తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట.

సైఫ్ అలీ ఖాన్ ఈ పాత్రకు ఓకే చెబితే బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యే అవకాశం మరి కొరటాల ఆఫర్ ను ఈయన ఒప్పుకుంటారో లేదో.ఇక ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చారు మేకర్స్.దీంతో అతి త్వరలోనే షూట్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మితం అవుతుంది.
చూడాలి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.ఎప్పుడు రిలీజ్ అవుతుందో.







