భార్యాభర్తలు ఒకతాటిపైన నడవడం సమాజానికి మంచిదే.అయితే అదే భార్యాభర్తలు ధర్మం మరిచి ప్రవర్తిస్తే మాత్రం అది సమాజానికి చేటుగా పరిణమిస్తుంది.
తాజాగా జరిగిన ఓ సంఘటనే దానికి ఓ ఉదాహరణ.అవును, భర్త భార్యకు సపోర్ట్ చేయాలి.
అదే సమయంలో ఆమె చేసిన తప్పులకు సుతిమెత్తగా దండించాలి.లేదంటే అవమాన పాలవుతారు.
ఓ వ్యక్తి తన భార్య చేసిన పనికి వత్తాసు పలికాడు.కట్ చేస్తే దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు.
దీంతో ఆ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది.అలాగే సోషల్ మీడియాకు కూడా ఎక్కింది.
వివరాల్లోకి వెళితే… తన భార్యతో కలిసి అమెరికాలోని ఓక్లాహోమాలో రిచర్డ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ప్రస్తుతం అతడి వయసు 61ఏళ్లు.రిచర్డ్ భార్య స్థానికంగా ఉన్న స్టార్‌బక్స్ కేఫ్ కు వెళ్లి అక్కడ 1.2డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.103 విలువగల ఓ డ్రింక్‌ను ఆర్డర్ చేసి దాన్ని కొంత తాగి.బాగోలేదంటూ అక్కడి సిబ్బందితో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగింది.
తన డబ్బులను తనకు ఇచ్చేయాలంటూ కూడా గొడవ పెట్టుకుంది.దానికి స్టార్ బక్స్ కేఫ్ సిబ్బంది అందుకు నిరాకరించడంతో అక్కడ నుంచి వెళ్లిపోయింది.

కట్ చేస్తే, కొంత సమయం తర్వాత భర్త రిచర్డ్‌ని వెంటబెట్టుకొని ఆ కేఫ్‌కు మరలా వచ్చింది.మరోసారి తన డబ్బులను రీఫండ్ చేయాలని అడిగింది.దానికి తన భర్త కూడా వత్తాసు పలకడంతో గొడవ కాస్త పెద్దదైంది.అయితే ఏదిఏమైనా అక్కడి సిబ్బంది మాత్రం డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంతో ఆగ్రహానికి లోనైన రిచర్డ్.
అక్కడ ఉన్న డబ్బుల పెట్టను పట్టుకుని పరుగులు తీశాడు.కారులో సదరు డబ్బుతో ఇంటికి వెళ్లిపోయారు.దీంతో కేఫ్ సిబ్బంది.పోలీస్‌లకు సమాచారం ఇవ్వగా రిచర్డ్ కారు వివరాలను తెలుసుకొని రిచర్డ్ ఇంటి అడ్రస్‌ను గుర్తించి.
అతడిని అరెస్ట్ చేశారు.







