స్మార్ట్ యుగమని ఈ కాలానికి ఏ మహానుభావుడు పేరుపెట్టాడో తెలియదు కానీ, ఇక్కడ లభించే ప్రతి వస్తువు స్మార్ట్ అయిపోతోంది.అలాంటివే ఇక్కడ ప్రస్తుతం డిమాండ్ సంపాదించుకుంటున్నాయి.
ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్స్ తరువాత స్మార్ట్‌వాచ్ లకు మంచి డిమాండ్ ఏర్పడింది.అవును, ప్రస్తుతం మన భారతదేశంలో స్మార్ట్‌వాచ్ మార్కెట్‌కు ఉన్న డిమాండ్ మరే దానికి లేదు అని చెప్పుకోవాలి.2022 నవంబర్‌లో కౌంటర్‌పాయింట్ అనే పరిశోధనా సంస్థ నివేదిక ప్రకారం.2022లో భారత మార్కెట్లో అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌వాచ్ అమ్ముడు పోయిందని చెప్పుకొచ్చారు.
దానికి బలమైన కారణాలు వున్నాయి.కొన్నేళ్ల క్రితం వరకు చాలా స్మార్ట్‌వాచ్‌ల ధర రూ.10వేల కన్నా ఎక్కువగా ఉండేది.దాంతో వినియోగదారులు వాటివైపు మొగ్గుచూపేవారు కాదు.
కానీ నేడు పరిస్థితి మారింది.సరసమైన ధరలకే స్మార్ట్ బ్యాండ్‌లు లభ్యమౌతున్నాయి.
చైనా దిగ్గజం Xiaomi, OnePlus వంటి లెగసీ బ్రాండ్‌లు సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.రూ.5వేల లోపే వాచీలను లాంచ్ చేశాయి.అవేమిటో ఇక్కడ చూద్దాము.

ఇందులో మొదట OnePlus నోర్డ్ వాచ్ గురించి చెప్పుకోవచ్చు.ఈ ఏడాది భారత మార్కెట్లోకి వచ్చిన నార్డ్-సిరీస్ వాచ్ రూ.4,999 ధరతో మార్కెట్‌లోకి వచ్చింది.తరువాత రియల్‌మీ వాచ్ 3 గురించి మాట్లాడుకోవాలి.
ఆపిల్ వాచ్‌తో ఇది సమానంగా పనిచేస్తుంది.భారత మార్కెట్లో దీని ధర రూ.3,499గా ఉంది.ఆ తరువాత అమాజ్‌ఫిట్ బిప్ 3 బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.అయితే ఈ వాచ్ ధర రూ.10వేల కన్నాఎక్కువగా ఉంటుంది.Redmi వాచ్ 2 లైట్ బ్రాండ్ విన్నారా? దీని బెనిఫిట్స్ ఏమిటంటే.స్మార్ట్ బ్యాండ్‌ల బెనిఫిట్స్ అందిస్తుంది.భారత మార్కెట్లో ధర రూ.3,499గా ఉంది.ఇక చివరగా ఫైర్-బోల్ట్ రింగ్ 3 గురించి చెప్పుకోవాలి.ఇది Realme Watch 3 మాదిరిగానే.పనిచేస్తుంది.ఇది రూ.2,999 ధరల జాబితాలో ఉన్న చౌకైన వాచీలలో ఒకటిగా చెప్పవచ్చు.







