2022 సంవత్సరంలో భారీగా నష్టాలను మిగిల్చిన సినిమా ఏదనే ప్రశ్నకు కొంతమంది ఆచార్య సినిమా పేరును సమాధానంగా చెబితే మరి కొందరు లైగర్ సినిమా పేరును సమాధానంగా చెబుతారు.విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన లైగర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతం అనిపించుకుంటుందని అందరూ భావించగా అందుకు భిన్నంగా ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుని అందరికీ భారీ షాకిచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కాగా ఈ సినిమాకు 6.7 రేటింగ్ వచ్చింది.ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానల్ లో ఈ సినిమా ప్రసారమైంది.అయితే ఈ రేటింగ్ సాహో మూవీ రేటింగ్ కంటే ఎక్కువ కాగా ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రసారమైన చాలా సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమా బెటర్ రేటింగ్ సాధించిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ లైగర్ మూవీ కథకు ఓకే చెప్పి తప్పు చేశారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా మరో అర్జున్ రెడ్డి అవుతుందని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది.విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
సంక్రాంతి పండుగ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
సమంత కూడా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో త్వరలో పాల్గొంటున్నారు.సమంత ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.లైగర్ మూవీ నష్టాల భర్తీ ఇంకా జరగలేదని బోగట్టా.
ఈ సినిమా వల్ల పూరీ జగన్నాథ్ కు కొత్త సమస్యలు ఎదురయ్యాయని సమాచారం.