రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. మరీ అంత ఖరీదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 Ram Charan Wore Expensive Dress Worth In Lakhs , Ram Charan Shirt Cost , Tollywo-TeluguStop.com

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉన్నాడు రామ్ చరణ్.కాగా రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో చెర్రీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ ఎక్కువగా కాస్ట్యూమ్స్ విషయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.

చెర్రీ ధరించే వాచ్, షర్ట్స్, షూస్ ధరల విషయాలలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉన్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి రామ్ చరణ్ తన స్టైలిష్ లుక్ విషయంలో వార్తల్లో నిలిచాడు.

తాజాగా సెమీ క్రిస్మస్ వేడుకలలో రామ్ చరణ్ పాల్గొన్నారు.అందరూ ఒక దగ్గర చేరి సరదాగా సమయం గడపడంతో పాటు ఫోటోలు దిగారు.అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో మెగా అభిమానులతో పాటు నెటిజెన్స్ కళ్ళు చరణ్ ధరించిన ఆ షర్టు పైనే పడ్డాయి.

దీంతో చాలామంది చరణ్ ధరించిన ఆ షర్టు ధర ఎంతో తెలుసుకోవాలని తాపత్రయ పడుతున్నారు.

తగర్ రామ్ చరణ్ ధరించిన ఒక షర్ట్ ధర అక్షరాల రూ.,1,21,840.లైట్ బ్లూ కలర్ షర్ట్ పై ప్యాచ్ డీటైల్ వర్క్ చేయబడింది.

ఆ షర్ట్ బ్రాండ్ జున్యా వతనాబే అని తెలుస్తోంది.చాలామంది రాంచరణ్ షర్టు కాస్ట్ తెలిసి షాక్ అవుతున్నారు.

ఒక్క షర్టు ధర లక్షా పాతిక వేల అని అవాక్కవుతున్నారు.రామ్ చరణ్ ఒక్క షర్టుతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు నాలుగు నెలలు బ్రతకవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు మాత్రం మెగా హీరో అంటే ఆ మాత్రం రేంజ్ ఉండాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube