ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా 7హిల్స్, మానిక్‌చంద్ ప్రొడక్ట్స్ డైరెక్టర్స్‌పై దృష్టి సారించిన ఈడీ ఇవాళ మరోసారి అభిషేక్ ఆవులను విచారించనుంది.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్న ఈడీ.కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ ను విచారించేందుకు కోర్టు అనుమతిని కోరింది.ఈ నేపథ్యంలో చంచల్ గూడ జైలులోనే ఆయన స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేయనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కూడా ఈడీ విచారించనుంది.
ఈనెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.