ప్రముఖ స్మార్ట్‌వాచ్‌ల తయారీ కంపెనీ బోట్ గురించి తెలియని యువకులు వుండరు.తక్కువ ధరలలోనే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ని అందించడంలో బోట్ ఎప్పుడు మార్కెట్లో ముందుంటుంది.
అందుకే శరవేగంగా ఈ సంస్థ ముందుకు దూసుకుపోతోంది.కాగా భారతదేశంలో బ్యాంగ్ స్మార్ట్‌వాచ్‌ను తాజాగా ఈ సంస్థ విడుదల చేసింది.
మంచి అప్డేటెడ్ ఫీచర్లతో లాంఛ్ చేసింది.ఆ వాచ్ పేరు బోట్ వేవ్ ఎలక్ట్రా.
కాగా దీని ధర చాలా తక్కువ మరియు మార్కెట్‌లోని నాయిస్ కలర్‌ఫిట్ లూప్ Amazfit Pop 2 వంటి స్మార్ట్‌వాచ్‌లతో పోటీపడటం కొసమెరుపు.
అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే ఇది కాలింగ్ ఫీచర్‌తో రావడం.
అవును, తక్కువ ధరకే ఇంత మంచి ఫీచర్ లభించడం అంటే చిన్న విషయం కాదు.ఇక బోట్ వేవ్ ఎలక్ట్రా స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే boAt Wave Electra 1.81-అంగుళాల HD రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది.అలాగే గడియారం స్క్వేర్ డయల్‌తో 550 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి వుంది.
ప్రీమియం అల్యూమినియం అల్లాయ్ డిజైన్ దీని సొంతం.గడియారం IP68 రేటింగ్‌ను పొంది వుంది.
ఎందుకంటే దుమ్ము, చెమట మరియు స్ప్లాష్ రెసిస్టెంట్.

బోట్ వేవ్ ఎలక్ట్రా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి వుంది.వాచ్‌లో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి.కాల్ చేయడానికి మైక్రోఫోన్, స్పీకర్ మరియు బ్లూటూత్ ఇంటర్నల్ గా అమర్చబడి వున్నాయి.
వాచ్ లోపల 50 కంటే ఎక్కువ పేర్లు సేవ్ చేసుకోవచ్చు.బోట్ వేవ్ ఎలక్ట్రాలో బలమైన బ్యాటరీ అందుబాటులో ఉంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ వాచ్ 7 రోజుల పాటు ఉంటుంది.బ్లూటూత్‌కు కనెక్ట్ చేసిన తర్వాత, వాచ్ కనీసం 2 రోజుల పాటు అలాగే ఉంటుంది.భారతదేశంలో బోట్ వేవ్ ఎలక్ట్రా ధర రూ.1,799 కలిగి వుంది.కాగా ఇది 3 రంగులలో (నలుపు, నీలం మరియు పింక్) లభించనుంది.







