సోషల్ మీడియా అనునిత్యం అనేక రకాల వీడియో కంటెంట్ తో నిండిపోతూ ఉంటుంది.అయితే అందులో ఏ కొన్నో వైరల్ అవుతూ ఉంటాయి.
ఆసక్తి కరంగా వుండే వీడియో కంటెంట్ ని నెటిజన్లు చాలా ఆదరిస్తారు.ఈ క్రమంలో ఆ వీడియోలు మిలియన్ల వ్యూస్ పొందుతూ ఉంటాయి.
ఈ క్రమంలోనే ఒక వీడియో నెటిజన్ల కంట పడింది.కాగా ఈ వీడియో నెటిజన్ల ఆగ్రహానికి గురి అయింది.
అవును, అది ఒక రైల్వే స్టేషన్. అక్కడ వచ్చే పోయే రైళ్లతో, మనుషులతో స్టేషన్ కిక్కిరిసిపోయి ఉంటుంది.
ఇంతలో సడెన్ గా ఓ ట్రక్ వచ్చి చేరింది.
ఓ రద్దీ ప్లాట్‌ఫామ్‌పై అలా భారీ ట్రక్కు కనిపించటం అక్కడి ప్రయాణికులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా, అనేక మందిని అవాక్కయేలా చేస్తోంది.విషయం ఏమంటే, కొద్ది నెలల క్రితం ముంబైలో ఓ ఆటో రిక్షా ఏవిధంగా అయితే ప్లాట్ ఫామ్ పైకి వచ్చిందో.
అదే విధంగా ఇక్కడ ప్లాట్ ఫామ్ పై నుంచి లారీని వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఆ సమయంలో ప్లాట్ ఫామ్ పై ప్రయాణికులు భారీగానే ఉండటం మనం గమనించవచ్చు.కాగా అది ఏ రైల్వే స్టేషన్ అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.కానీ, ప్లాట్ ఫామ్ నంబర్ మాత్రం స్పష్టంగా కనబడుతోంది.
అది ప్లాట్ ఫామ్ నంబర్ 9.ఇలా ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ప్లాట్ ఫామ్స్ పైకి వాహనాలను రావడం చాలా విడ్డురమని నెటిజన్లు విమర్శిస్తున్నారు.ఇంకొంతమంది నెటిజన్లు స్పందిస్తూ… తాము చాలా సార్లు రైల్వే గుండా ప్రయాణించామని, అయితే తామెన్నడూ ఇలాంటి దృశ్యాలు చూడలేదని చెప్పడం గమనార్హం.







