ప్రపంచ క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న SA20 league ప్రకటన వచ్చేసింది.అవును, IPL (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఏ ముహూర్తాన స్టార్ట్ చేసిందో గాని, ప్రపంచంలో వివిధ దేశాలు దాన్ని అనుసరిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇలాంటి లీగ్ లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి.పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా చాలా దేశాల బోర్డులు ఇలాంటి లీగ్ లు ప్రకటించి విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.
ఎందుకంటే ఈ లీగ్ లు ఎక్కడ జరిగినా విశేష ప్రజాదరణ లభిస్తోంది.మరోవైపు డబ్బుకి డబ్బు కూడాను.
ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణాఫ్రికా బోర్డు కూడా ఓ లీగ్ ప్రకటించింది.అదే SA20 league.కాగా ఈ లీగ్ ప్రైజ్ మనీని కూడా తాజాగా వెల్లడించి ఆశ్చర్యపోయేలాగా చేసింది.ఈ టోర్నీకి మొత్తం 7 కోట్ల ర్యాండులు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.33.35 కోట్లు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్లు లీగ్ కమిషనర్ అయినటువంటి గ్రేమ్ స్మిత్ తాజాగా ఓ మీడియా వేదికగా తెలిపారు.కాగా దక్షిణాఫ్రికా ఫ్రాంచైజీ క్రికెట్ లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద మొత్తం కావడం గమనార్హం.

అయితే డేట్స్ కూడా ఈ సందర్భంగా ప్రకటించేసారు.జనవరి 10 నుండి ఫిబ్రవరి 11 వరకు ఈ లీగ్ జరగనుంది.మొత్తం 6 జట్లు పాల్గొననున్న ఈ లీగ్ లో మొత్తం 33 మ్యాచ్ లు ఉంటాయని వినికిడి.
కాగా, ఈ ఆరు జట్లను IPL ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం ఇక్కడ గమనించదగ్గ విషయం.కాగా ఆ 6 జట్లు జోబర్గ్ సూపర్ కింగ్స్, పార్ల్ రాయల్స్, MI కేప్ టౌన్, ప్రిటోరియా క్యాపిటల్స్, సన్‌రైజర్స్ ఈస్టర్న్, డర్బన్స్ సూపర్ జెయింట్స్ జట్లలో ప్రపంచ స్థాయి ఆటగాళ్లు మనకు కనులవిందు చేయనున్నారు.







