వాటర్ ఫాల్స్ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండనే వుండరు.ఏదన్న ఓ కొండనుండి అలా జాలువారే వాటర్ లో కింద ఉండి స్నానం చేయడమంటే యువతకి చాలా ఇష్టం.
మనలో అనేకమంది వీకెండ్‌లో అలా సరదాగా సేదతీరాలని పర్యాటక ప్రదేశాలకు చెక్కేస్తూ వుంటారు.అయితే దాదాపుగా అందరూ ఎక్కువగా వెళ్లే టూరిస్ట్ ప్లేస్ ఈ వాటర్ ఫాల్స్ అని మనకు తెలుసు.
ఎందుకంటే ఆ లిస్టులో మనమూ ఉంటాము కాబట్టి.అలా ఏదన్న ఓ టూర్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ముందుగా మన చుట్టు పక్కల ఎక్కడెక్కడ జలపాతాలు ఉన్నాయో వెతుక్కుని మరీ వెళ్తుంటాం.
అయితే అన్ని సార్లు కాదుగాని, టైం ఎప్పుడూ మనది కాదు.అందుకనే ఆయా సమయాలలో చాలా జాగ్రత్తలు తీసుకొని మరీ మసలుకోవాలి.లేదంటే ప్రాణాలు పోయే ప్రమాదాలు అనేకం వున్నాయి.ఇటీవలి కాలంలో చూసుకుంటే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.తాజాగా అలాంటి ఓ ఘటన ఫిలిప్పైన్స్‌లో జరిగింది.2021లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడం కొసమెరుపు.

వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది పర్యాటకులు వాటర్ ఫాల్స్ వద్ద ఒళ్ళు మరిచి ఎంజాయ్ చేస్తున్నారు.అంతా బాగానే ఉంది అనుకొనే సరికి ఉన్నట్టుండి నీళ్ల ప్రవాహం పెరిగింది.దాంతో ఒక్క క్షణం ఏం జరుగుతోందో వాళ్లకు అర్థం కాలేదు.నీళ్లు చాలా వేగంగా దూసుకొచ్చేసరికి వారు తేరుకుని జాగ్రత్త పడేలోగా అందరూ ఆ నీళ్లలో పడి కొట్టుకు పోవడం ఇక్కడ గమనించవచ్చు.
నార్తర్న్ కెబూలోని కాట్‌మాన్ టౌన్‌లో టినుబ్దన్ వాటర్ ఫాల్స్ వద్ద ఈ ప్రమాదం జరగగా ట్విటర్‌లో ఓ యూజర్ పోస్ట్ చేశాడు.కంటెంట్ పాతదే అయినా… నేటికీ వైరల్ అవుతోంది.
నెటిజన్లు స్పందిస్తూ అలాంటి చోట్లకు వెళ్ళేటప్పుడు జరా జాగ్రత్తగా వుండండి అంటూ సూచిస్తున్నారు.







