మాములుగా ఈ మధ్య వచ్చే సినిమాలకు జనాలు థియేటర్లకు వెళ్లడమే లేదు.నాలుగు రోజులు గడిస్తే ఓటిటి లోకి వస్తుంది లే అనుకుంటున్నారు, అందుకే సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది.
ఇక ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటె కొన్నేళ్లు వెనక్కి వెళితే ఇంకోలా ఉండేది.సినిమా 25 వారాలు ఆడితేనే బ్లాక్ బస్టర్ అని వంద రోజులు ఆడితే హిట్ అని కొని కొలమానాలు ఉండేవి.
ఒకప్పుడు వంద రోజుల సినిమా ఇప్పుడు వారం రోజుల సినిమాగా మారిపోయింది.కానీ నాటి రోజుల్లో ఎప్పుడో కానీ థియేటర్ నుంచి వెళ్ళిపోయినా సినిమా టీవీల్లో వచ్చేది కాదు.
అందుకే ఎక్కువగా సినిమాలు థియేటర్ లోనే చూడటానికి ఇష్టపడేవారు.అయితే ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో ఒక విచిత్రమైన సంఘటన గురించి తెలుసుకుందాం.అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీభత్సమైన వర్షాలు పడి ఊళ్లకు ఊళ్ళు వరదల్లో కొట్టుకొని పోయిన రోజుల్లో ఈ సంఘటన జరిగింది.దక్షిణ భారత దేశంలోనే ఈ తుఫాన్ అతి పెద్దది.
దీనిని మచిలీ పట్నం తుఫాన్ గా పిలిచారు.మే నెలలో 1990 లో నాల్గవ తారీఖు నుంచి 10 వ తారీఖు వారు ఈ తుఫాన్ కొనసాగింది.
ఈ తుఫాన్ వల్ల ఆంధ్ర ప్రదేశ్ లో చాల ప్రాణ నష్టం, ఆస్థి నష్టం జరిగింది.

సరిగ్గా అదే సమయంలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా విడుదల అయ్యాయంది.9 వ తారీఖు మే నెలలోనే ఈ సినిమా విడుదల అని ముందే ప్రకటించడం వలన వేరే ఆలోచన లేకుండా ఆ డేట్ లోనే విడుదల చేసారు.అయితే వర్షం జోరు ఎక్కువ కావడం తో రాష్ట్రంలోని అన్ని థియేటర్లను మూసేసారు.
కానీ చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా చూడటానికి వరదల్లో కూడా జనాలు ఎగబడ్డారు.అయితే పరిస్థితి చేయి దాటి పోవడం తో ఆ సినిమా హాళ్లు ఏవి కూడా ఓపెన్ చేయలేదు.
కానీ రెండు థియేటర్ల ముందు జనల సినిమా వేయాలని ధర్నా చేయడం తో మోకాళ్ళ లోతు నీళ్లలో కూర్చొని సినిమా వేస్తే చూసి ఎంజాయ్ చేసారు.ఇలాంటి ఒక సంఘటన మన ఇండియన్ సినిమా చరిత్రలో జరగలేదు.
కేవలం ఆ సృష్టి రాఘవేంద్రుడికే సాధ్యం అయ్యింది.







