విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే.తమిళం లో కంటే కూడా తెలుగు లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బిచ్చగాడు సినిమా కు ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది.
బిచ్చగాడు 2 సినిమా ను దర్శకుడు కం హీరో విజయ్ ఆంటోని ప్రకటించి చాలా కాలమైంది.కానీ ఇప్పటి వరకు ఆయన నుండి అప్డేట్ రాక పోవడంతో అభిమానులతో పాటు బిచ్చగాడు సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎట్టకేలకు తమిళ మీడియా కు బిచ్చగాడు టీం రిలీజ్ డేట్ విషయం లో లీక్ ఇచ్చారు.అధికారికంగా ప్రకటించినప్పటికీ సినిమా ఎప్పుడు విడుదల కాబోతుంది అనే విషయం లో క్లారిటీ ఇవ్వడం జరిగింది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బిచ్చగాడు 2 సినిమా ను ఈ సమ్మర్ లోనే అంటే 2023 ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు మీడియా వర్గాలు కూడా బిచ్చగాడు 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తమిళ్ మరియు తెలుగు లో ఏక కాలంలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఈ సినిమా తో మరో సారి విజయ్ ఆంటోని ఘన విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.బిచ్చగాడు సినిమా తర్వాత విజయ్ ఆంటోనీ నటించిన పలు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
కానీ అందులో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకులను అల్లరించలేక పోయాయి.బిచ్చగాడు 2 సినిమా మాత్రం కచ్చితంగా మరో విజయాన్ని ఆయనకు తెచ్చిపెడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బిచ్చగాడు సినిమా సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యం లో విజయ్ ఆంటోనీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.







