తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో దారుణం జరిగింది.ఓ జ్యోతిష్యుడిని గుర్తు తెలియని దుండగులు కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశారు.
మృతుడు శ్రీకాళహస్తికి చెందిన జ్యోతిష్యుడు చంద్రయ్యగా గుర్తించారు.ముందుగా మృతుని నివాసానికి వచ్చిన దుండగులు చంద్రయ్యపై దాడి చేసి హతమార్చారు.
కాగా శాంతిపూజలు, తాయత్తులతో శ్రీకాళహస్తిలో చంద్రయ్య గుర్తింపు పొందాడు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.







