కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.విద్యుత్ పంపిణీ నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు.తెలంగాణ రూ.30 వేల కోట్ల నష్టాన్ని చవి చూసిందని తెలిపారు.స్వయం ఉత్పాదక శక్తి పెంచుకోవాలన్న ఆయన రామగుండం కేంద్రంగా బొగ్గు లభిస్తే యాదాద్రిలో పవర్ ప్రాజెక్టు పెట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.విద్యుత్ సంస్థల్లో నష్టాన్ని కేసీఆర్ భరించాలని వెల్లడించారు.







