ఓపిక పట్టండి.. జవాబులు దొరుకుతాయి.. చిరు అల్లుడి కామెంట్స్ వెనుక అర్థమిదేనా?

చిరంజీవి అల్లుడిగా, శ్రీజ రెండో భర్తగా ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ తన సినిమాలతో మెగా అభిమానులను ఆకట్టుకోవడంలో మాత్రం ఫెయిలయ్యారు.విజేత, సూపర్ మచ్చి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ దేవ్ కు ఈ రెండు సినిమాల ఫలితాలు భారీగా షాకిచ్చాయి.

 Kalyaan Dhev Shocking Comments Become Hot Topic Details Here Goes Viral , Kaly-TeluguStop.com

కళ్యాణ్ దేవ్ సినీ కెరీర్ సాఫీగా సాగడం లేదు.మెగా ఫ్యామిలీ నుంచి కూడా కళ్యాణ్ దేవ్ కు సపోర్ట్ లభించడం లేదు.

అయితే కళ్యాణ్ దేవ్ మాత్రం తాజాగా శ్రీజతో విడాకుల గురించి, నెగిటివ్ కామెంట్ల గురించి తనపై వస్తున్న విమర్శల గురించి స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.కాస్త ఓపిక పట్టండి.

అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని కళ్యాణ్ దేవ్ పేర్కొన్నారు.శ్రీజతో విడాకులకు సంబంధించి త్వరలోనే సమాధానం దొరకనుందని కళ్యాణ్ దేవ్ చెప్పకనే చెప్పేశారు.

అయితే మెగా ఫ్యాన్స్ కు మాత్రం శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోవడం ఏ మాత్రం ఇష్టం లేదు.ఈ జోడీ కలకాలం కలిసే ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే అభిమానులకు శుభవార్త చెబుతారో లేక షాకిస్తారో చూడాల్సి ఉంది.చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ శ్రీజతో విడిపోతే మాత్రం అతని సినీ కెరీర్ పూర్తిస్థాయిలో ముగిసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కళ్యాణ్ దేవ్ కు సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం కూడా ఒకింత మైనస్ అవుతోంది.

రాబోయే రోజుల్లో కళ్యాణ్ దేవ్ ఏ విధంగా ముందుకెళతారో చూడాల్సి ఉంది. వైరల్ అవుతున్న వార్తల గురించి శ్రీజ కూడా స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.కళ్యాణ్ దేవ్ తో సినిమాలను నిర్మించడానికి టాలీవుడ్ నిర్మాతలు సైతం ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు.

శ్రీజ సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం లేదనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube