రాజన్న సిరిసిల్ల జిల్లా మాడపల్లిలో యువతి షాలిని కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్ బయటకు వచ్చింది.ఈ మేరకు షాలిని ఓ వీడియో విడుదల చేసింది.
తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్ట పూర్వకంగానే జానీతో వెళ్లినట్లు పేర్కొంది.రహస్య ప్రదేశంలో జానీని పెళ్లి చేసుకున్న షాలినీ ఆమె పెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మాస్క్ ధరించడం వల్ల తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తు పట్టలేకపోయినట్లు చెప్పింది.జానీ, తను నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది.
ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే బయటకు వచ్చేసినట్లు వెల్లడించింది.అనంతరం తన తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉందని తెలిపింది.







