సినీ నటుడు మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా.
మరియు నిర్మాతగా ఇంకా విద్యాసంస్థల అధినేతగా విజయవంతంగా రాణించారు.ఒకపక్క విద్యాసంస్థలు కొనసాగిస్తూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. గతంలో రాజకీయాల్లో కూడా రాణించడం జరిగింది.2019 ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు.ఎటువంటి విషయమైనా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి.
ఈ క్రమంలో తాజాగా ఐఏఎస్ మరియు ఐపీఎస్ లపై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి.
విషయంలోకి వెళ్తే సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తుంటారని విమర్శించారు.కింది స్థాయిలో ఉండే పోలీసులపై వాళ్లపై ఉండే పోలీసు అధికారులు.
ఆ తర్వాత వాళ్లపై ఐపీఎస్ లా ఒత్తిడి ఉంటుందని అన్నారు.

ఇదంతా నిజంగా నేను కళ్ళారా చూశాను.కింది స్థాయి ఉద్యోగస్తులు నిజం చెబితే ఉద్యోగం పోతుందని పై స్థాయి అధికారులు అన్న వ్యాఖ్యలు విన్నాను.దీంతో ప్రభుత్వంలో ఉండే పై స్థాయి అధికారులు ఎక్కువ శాతం… ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటారని తెలియజేయడం జరిగింది.
పోలీస్ శాఖకు నేను ఎప్పుడూ గౌరవం ఇస్తాను.కానీ పోలీస్ శాఖలో జరిగేది ఇదే అని మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.







