సూపర్ స్టార్ మహేష్ బాబు ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో తను తప్ప మరెవరూ నటించలేరనేంత అద్భుతంగా నటిస్తారు.త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇప్పటికే రెండు సినిమాలలో నటించిన మహేష్ బాబు మరో సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు.
అయితే ఈ సినిమాలో టబు కూడా కీలక పాత్రలో నటించనున్నారని సమాచారం.మహేష్ పై మోజు పడే ఆంటీ రోల్ లో టబు కనిపించనున్నారని తెలుస్తోంది.
సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలలో ఇలాంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు.అయితే కథ డిమాండ్ చేయడంతో త్రివిక్రమ్ తన సినిమాలో ఇలాంటి పాత్రను క్రియేట్ చేశారని తెలుస్తోంది.
అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ తల్లి పాత్రలో టబు కనిపించిన సంగతి తెలిసిందే.ఆ సినిమాలో టబు నటనకు మంచి మార్కులు పడ్డాయి.మహేష్ ఈ సినిమాకు 70 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.2023 దసరాకు ఈ సినిమాను కచ్చితంగా విడుదల చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఆగష్టు టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా మహేష్ పూజా హెగ్డే జోడీ ఈ సినిమాలో మరోసారి రిపీట్ అవుతున్న సంగతి తెలిసిందే.మహేష్ పూజా హెగ్డే త్వరలో ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నారు.

మహేష్ పూజా హెగ్డే ఫ్యాన్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.త్రివిక్రమ్ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది.త్రివిక్రమ్ ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధించి హ్యాట్రిక్ ఖాతాలో వేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.యూనివర్సల్ కాన్సెప్ట్ తో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.







