కేవలం ఈ రెండు పదార్థాలతో హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.. తెలుసా?

హెయిర్ ఫాల్.దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు.

 Hair Fall Can Be Prevented With Just These Two Ingredients, Rice Water, Egg, Hai-TeluguStop.com

అయితే కొందరిలో జుట్టు రాలుతున్న మళ్లీ కొత్త జుట్టు వచ్చేస్తుంటుంది.కానీ కొందరిలో అలా కాదు.

జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది.కానీ కొత్త జుట్టు రాదు.

దీంతో ఒత్తుగా ఉండాల్సిన జుట్టు పలుచగా మారిపోతుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

ఖరీదైన షాంపూ, ఆయిల్ ను వాడుతుంటారు.రకరకాల ఫేస్ ప్యాక్ లు, మాస్కులు వేసుకుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలియక తీవ్రంగా సతమతం అయిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు చింతించకండి.ఎందుకంటే కేవలం ఇప్పుడు చెప్పబోయే రెండు పదార్థాలతోనే హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టవచ్చు.

మరి ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటి.? వాటిని ఎలా ఉపయోగించాలి.? పంటి విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.ఇలా ఉడికించిన మిశ్రమం నుంచి స్ట్రైన‌ర్ సహాయంతో రైస్ వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ రైస్ వాటర్ ను పూర్తిగా చల్లార పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఈ రైస్ వాటర్ లో రెండు ఎగ్ వైట్స్ ను వేసి హ్యాండ్ బ్లెండర్ సహాయంతో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్‌ షాంపూను యూస్ చేసి త‌ల స్నానం చేయాలి.

వారంలో రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే రైస్ వాట‌ర్ మ‌రియు ఎగ్ వైట్ లో ఉండే పోష‌కాలు జుట్టు రాలడాన్ని క్రమంగా తగ్గిస్తాయి.అదే సమయంలో కురులు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరిగేందుకు సైతం తోడ్ప‌డ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube