మెగా డాటర్ నిహారిక డిసెంబర్ 18వ తేదీ తన 29వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ క్రమంలోనే నిహారిక పుట్టినరోజు కావడంతో మెగా అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఈమెకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిహారిక ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా నిహారిక పుట్టినరోజు కావడంతో తన అన్నయ్య వరుణ్ తేజ్ నిహారికకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ఇంస్టాగ్రామ్ వేదికగా నిహారికకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ… పాప నిహారిక… నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.ఈ ప్రత్యేకమైన రోజున నువ్వు ఎంతో సరదాగా సాహసంగా గడుపుతావని భావిస్తున్నాను.
నీ జీవితంలో 20 లోని చివరి ఏడాదిని ఎంతో సద్వినియోగంగా ఉపయోగించుకుంటావని భావిస్తున్నాను అంటూ వరుణ్ తేజ్ నిహారిక కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

వచ్చే యేడాది ఈమె 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఈ సందర్భంగా వరుణ్ తేజ్ తన చెల్లికి స్పెషల్ విషెస్ తెలియజేయడమే కాకుండా తన చెల్లితో కలిసి దిగిన కొన్ని రేర్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీనితో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక నిహారిక పరిచయమైన అనంతరం ఈమె నటిగా నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.
ప్రస్తుతం ఈమె వెంకట చైతన్య అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు.







