తెలంగాణ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో పాదయాత్రను కాంగ్రెస్ నిర్వహించనుంది.పీసీసీ చీఫ్ హోదాలో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఏఐసీసీ ఆదేశాల మేరకు పాదయాత్ర కొనసాగుతుందన్న ఆయన జనవరి 26 నుండి హాత్ సే హాత్ జోడో పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఇందుకు రూట్ మ్యాప్ రూపొందుతుందని పేర్కొన్నారు.
కనీసం రెండు నెలల పాటు పాదయాత్ర చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని వెల్లడించారు.ఈ క్రమంలో గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాదయాత్రలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.







