తాండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు.రేపు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.ఇందులో భాగంగా ఈడీ అధికారులు అడిగిన సమాచారం ఇవ్వనున్నారు.
ఆర్థిక లావాదేవీల సమాచారంతో రావాలని ఇప్పటికే ఈడీ నోటీసులు అందించింది.ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులపై సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చర్చించారు.
అనంతరం న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు.కాగా బెంగళూరు డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు ఎమ్మెల్యే విచారణకు రావాలంటూ నోటీసులు అందించిన విషయం తెలిసిందే.







