ముఖ చర్మం ఎంత తెల్లగా ఉన్నా సరే మచ్చలు ఉంటే కాంతిహీనంగానే కనిపిస్తుంది.అందుకే చర్మం పై ఏర్పడిన ముదురు రంగు మచ్చలను వదిలించుకోవడం కోసం తోచిన చిట్కాలు అన్నీ పాటిస్తుంటారు.
మార్కెట్లో లభ్యం అయ్యే ఖరీదైన క్రీమ్స్ ను కొనుగోలు చేసి వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హోం మేడ్ సిరం ను కనుక వాడితే చాలా సులభంగా మరియు వేగంగా మచ్చలను వదిలించుకోవచ్చు.
అదే సమయంలో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.మరి ఇంతకీ ఆ పవర్ ఫుల్ సీరంను ఎలా తయారు చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక మీడయం సైజ్ కీర దోసకాయను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక అలోవెరా ఆకును తీసుకుని వాటర్ గా కడిగి లోపల ఉండే జెల్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలు, ఫ్రెష్ అలోవెరా జెల్, గుప్పెడు కొత్తిమీర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండర్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను పల్చటి వస్త్రం సహాయంతో సపరేట్ చేసుకోవాలి.సపరేట్ చేసుకున్న ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే మన సీరం సిద్దం అవుతుంది.
ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు, నైట్ నిద్రించడానికి అరగంట ముందు ఈ సీరంను ముఖం దూది సాయంతో అప్లై చేసుకోవాలి.
రోజుకు రెండు సార్లు ఈ హోం మేడ్ సీరంను యూజ్ చేస్తే చర్మంపై ఎలాంటి ముదురు రంగు మచ్చలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.అదే సమయంలో చర్మం కాంతివంతంగా మరియు షైనీ గా సైతం మారుతుంది.