సాధారణంగా ప్రజలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగానే కొంటుంటారు.అయితే వారిలో చాలా చాలామంది తాముకొనే ఫుడ్స్‌లో ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు.
ప్యాకేజీపై గ్రీన్ కలర్ డాట్ ఉంటే అది పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ అని, రెడ్ కలర్ డాట్ ఉంటే అది నాన్ వెజిటేరియన్ అని కొందరికి తెలిసే ఉంటుంది.వారు కూడా దీనిని పెద్దగా చెక్ చేయరు.
అయితే ఇలా చెక్ చేయకపోవడం వల్ల ఏం తింటున్నామో కూడా తెలుసుకొనే పరిస్థితి ఉండదు.సాధారణంగా చాక్లెట్స్ పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ అని మనం భావిస్తుంటాం కానీ తాజాగా ఆ భావన తప్పు అని తెలిసింది.
ఇటీవల గొడ్డు మాంసం (బీఫ్)తో తయారుచేసిన చాక్లెట్లు రాజస్థాన్‌లో వెలుగు చూశాయి.ఉదయ్‌పూర్‌లోని ఢిల్లీ గేట్ క్రాస్ రోడ్స్ సమీపంలో ఈ బీఫ్ చాక్లెట్లను ఎగుమతి లేదా తయారు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు.
ఇక్కడ తయారైన ఆ చాక్లెట్లు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని షాపులకు పంపిణీ చేస్తున్నారు.చిల్లీ మిల్లీ పేరుతో తయారయ్యే ఈ చాక్లెట్లలో బీఫ్ ప్రొటీన్ ఉంటుందని సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న అధికారులు పెద్ద ఎత్తున చాక్లెట్లను స్వాధీనం చేసుకుని టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు తరలించారు.
షాకింగ్ విషయం ఏంటంటే ఉదయ్‌పూర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు నాలుగు అడుగుల దూరంలోనే ఈ చాక్లెట్ల విక్రయాలు జరుగుతున్నాయి.చిల్లీ మిల్లీ చాక్లెట్ ప్యాకెట్‌పై మేడ్ ఇన్ పాకిస్థాన్ అని ఒక లేబుల్ కనిపించింది.అలానే దానిపై నాన్-వెజ్ చాక్లెట్ అని తెలియజేసే వివరాలు ఉన్నాయి.ఈ చాక్లెట్ ధర రూ.20గా ఉంది.రాజస్థాన్‌లోని పలు షాపుల్లో ఈ రకం చాక్లెట్లను అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.అయితే ఈ విషయం తెలిసి బీజేపీ నేతలు మండిపడుతున్నారు.పాక్ వారు కుట్రతో ఇలాంటి చెత్త పనులు చేస్తున్నారని విమర్శించారు.అయితే చాక్లెట్లలో మాంసం కూడా పెడుతున్నారు కాబట్టి పిల్లలు పెద్దలు జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.