ఐపీఎల్ 2023 కోసం మినీ వేలం మరో వారం రోజుల్లోనే జరగనుంది.డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్న ఈ వేలం కోసం బీసీసీఐ ఆల్రెడీ ప్లేయర్ల లిస్ట్ రెడీ చేసింది.
వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్న ఈ ఐపీఎల్ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలో నెలకొల్పిన కొన్ని అరుదైన రికార్డులు హాట్ టాపిక్‌గా మారాయి.వాటిలో కొన్నిటి గురించి మనం తెలుసుకుందాం.
2017లో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ మేట్స్ అయిన క్రిస్ లీన్, సునీల్ నరైన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై హైయెస్ట్ పవర్‌ప్లే రన్స్ చేసి ఆశ్చర్యపరిచారు.ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ కలిసి ఫస్ట్ 6 ఓవర్లలోనే 105 రన్స్ చేసి చెక్కుచెదరని రికార్డు సృష్టించారు.ఈ టీమ్ కంటే ముందు ఐపీఎల్ 2014లో పంజాబ్‌పై పవర్‌ప్లే టైమ్‌లో 100 రన్స్ చేసి చెన్నై ఆ ఘనత సాధించింది.
చెన్నై రికార్డును కోల్‌కతా ప్లేయర్స్ బ్రేక్ చేశారు.ఐదేళ్ల తర్వాత కూడా వారి రికార్డు పదిలంగా ఉంది.కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన షకీబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్ కూడా ఐపీఎల్ చరిత్రలో ఐదో వికెట్‌కు బిగ్గెస్ట్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి అరుదైన రికార్డు సృష్టించారు.వీరు 2016లో గుజరాత్ లయన్స్‌పై 134 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పారు.

ఐపీఎల్ 2014 ఫైనల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు నిర్దేశించిన 200 పరుగులను కోల్‌కతా నైట్ రైడర్స్ టీం ఈజీగా అధిగమించింది.అలా ఈ మ్యాచ్‌లో గెలిచి హైయెస్ట్ రన్స్ ఛేజ్ చేసి విన్ అయిన టీమ్‌గా కేకేఆర్ రికార్డు క్రియేట్ చేసింది.ఇక కేకేఆర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1.5 స్ట్రైక్ రేట్‌తో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ 2014లో కోల్‌కతా వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలుపొంది వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన టీమ్‌గా పేరు తెచ్చుకుంది.







