తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.కక్ష సాధింపులు కేసీఆర్ కు అలవాటేనని చెప్పారు.
బీజేపీలో అలాంటివి ఉండవన్నారు.అవినీతి ఎక్కడ ఉంటే అక్కడికి ఈడీ వస్తుందని తెలిపారు.
తప్పు చేయని వారికి భయం ఎందుకని ఆమె ప్రశ్నించారు.ఫామ్ హౌజ్ కేసు దొంగ కేసు అని అందరికీ తెలిసిందన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత పేరు బయటకు వచ్చాకనే ఫామ్ హౌజ్ బయటకు వచ్చిందని ఆరోపించారు.కేసీఆర్ ఏ డ్రామా చేయమంటే ఆ డ్రామా చేశారు కాబట్టే నలుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ కు హీరోలయ్యారని విమర్శించారు.







