మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్, స్టార్ హీరో యశ్ ఒకరితో ఒకరు మాట్లాడుతూ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వేర్వేరు రంగాలకు చెందిన ఇద్దరు ప్రముఖులు కలవడంతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ తరపున యశ్ ప్రచారం చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరిగింది.
మరి కొందరు మాత్రం వీళ్లిద్దరూ ఎందుకు కలిశారో అర్థం కావడం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం నారా లోకేశ్, యశ్ అనుకోకుండా కలిశారట.
వీళ్లిద్దరూ కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలుస్తోంది.బెంగళూరులోని ఒకే హోటల్ లో వీళ్లిద్దరూ స్టే చేశారని ఆ సమయంలో ఒకరికొకరు ఎదురు పడటంతో కలిసి మాట్లాడుకున్నారని సమాచారం.
నారా లోకేశ్ యశ్ నటనను ప్రశంసించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
వీళ్లిద్దరి మీటింగ్ కు సంబంధించి స్పష్టత రావడంతో ఇకనైనా వీళ్ల గురించి వైరల్ అవుతున్న రూమర్లు ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది.
యశ్, నారా లోకేశ్ కెరీర్ పరంగా మరింత ఎదిగి సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.మరోవైపు యశ్ త్వరలో తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.
యశ్ ప్రాజెక్ట్ లన్నీ భారీ స్థాయిలోనే ఉండనున్నాయని బోగట్టా.

యశ్ స్థాయి అంతకంతకూ పెరుగుతుండటం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.ఈ ఏడాది టాప్ 10 సినిమాల జాబితాలో కేజీఎఫ్2 మూవీ కూడా ఉండటం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.రాబోయే రోజుల్లో కూడా నటుడిగా యశ్ స్థాయి అంతకంతకూ పెరగాలని ఆయన మరెన్నో సక్సెస్ లను అందుకొని ఇతర భాషల్లో సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
యశ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.







