మన భారత దేశంలో ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లోనే ఫుడ్ ఆర్డర్ చేయడం చాలా మందికి అలవాటయింది.బాగా ఇష్టమైన ఫుడ్స్ చిటికెలో ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకొని హాయిగా తినేస్తున్నారు ప్రజలు.
అయితే ఈ 2022వ సంవత్సరం మొత్తంలో ఎక్కువగా తమ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్డర్ చేసిన ఫుడ్స్‌లో బిర్యానీ నంబర్ వన్ ప్లేస్ లో నిలిచిందని ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది.ఆ తర్వాత మసాలా దోశ ఎక్కువగా ప్రజలు ఆర్డర్ చేసినట్లు వెల్లడించింది.
బాస్మతీ బియ్యం, మసాలా, ఇంకా కావాల్సిన ఇంగ్రిడియంట్స్ వేసి చేసే బిర్యానీ ఎప్పుడూ కూడా బోర్ కొట్టలేదు.ఈ ఫుడ్ ఐటమ్ ప్రతిసారీ నోరూరిస్తుంటుంది.
అందుకే దీనికి ఇంత డిమాండ్.

స్విగ్గీ డేటా ప్రకారం స్విగ్గీలో ప్రతి నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ చేస్తున్నారట.అంటే సెకనుకు 2.28 బిర్యానీలు, రోజుకు లక్ష వరకు బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయి.దీని తర్వాత మసాలా దోశకి బాగా ఆర్డర్స్ వస్తున్నాయట.సాధారణంగా దోశ అంటే ఇండియన్స్ కి బాగా ఇష్టం.ఒక ఇండియన్స్ కి మాత్రమే కాదు ఈ దోశ ఎక్కడ తయారుచేస్తే అక్కడి ప్రజలు దీనికి బాగా అడిక్ట్ అవుతుంటారు.అమెరికాలో కూడా ఈ దోశ పాపులర్ అయిందంటే అతిశయోక్తి కాదు.
కాబట్టి ఇది రెండవ స్థానంలో నిలవడంలో పెద్దగా ఆశ్చర్యం అక్కర్లేదు.ఇక స్నాక్స్ విషయానికి వస్తే 2022లో 40 లక్షలకు పైగా సమోసా ఆర్డర్లు నమోదయ్యాయి.
పాప్ కార్న్, సుషీ, మెక్సికన్ బౌల్స్, కొరియన్ స్పైసీ రామెన్, ఇటాలియన్ పాస్తా వైపు, గులాబ్ జామూన్, చాకూ లావా కేక్‌లు కూడా అత్యధికంగా పెట్టే ఆన్‌లైన్ ఆర్డర్స్‌లో టాప్ ప్లేస్ లో నిలుస్తున్నాయి.







