మహాలక్ష్మీ రవీందర్ పెళ్లి జరిగిన సమయంలో సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అటు మహాలక్ష్మికి ఇటు రవీందర్ కు ఈ పెళ్లి రెండో పెళ్లి కావడంతో వీళ్లిద్దరూ కలకాలం కలిసుంటారా? లేక డబ్బు కోసమే ఈ పెళ్లి జరిగిందా? అనే ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.పెళ్లి తర్వాత మహాలక్ష్మి క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేలా కొన్ని కథనాలు సైతం ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.
రవీందర్ తన పోస్ట్ లో అమ్మూ(మహాలక్ష్మి ముద్దుపేరు) నేను 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ పోస్ట్ కి చక్కటి క్యాప్షన్ ను రాయాలని ప్రయత్నించానని కానీ రాయలేకపోయానని నాకు అనిపించేది నేను రాస్తానని పేర్కొన్నారు.
ఈ 100 రోజులలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తూ గడిపానని రవీందర్ అన్నారు.నా వల్లే సంతోషంగా జీవిస్తున్నానని అమ్ము చెప్పిందని రవీందర్ కామెంట్లు చేయడం గమనార్హం.
మహాలక్ష్మి మరింత ఎక్కువ ప్రేమతో శ్రద్ధతో పోట్లాడుకుంటూ నాతో నడవాలని రవీందర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.బయటి ప్రపంచం నుంచి వస్తున్న కామెంట్లను ఏ మాత్రం పట్టించుకోకుండా మహాలక్ష్మి రవీందర్ సంతోషంగా జీవనం సాగిస్తుండటం ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.
మహాలక్ష్మికి, మొదటి భర్తకు ఒక కొడుకు ఉన్నారు.మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన మహాలక్ష్మి రవీందర్ ను పెళ్లి చేసుకున్నారు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో రవీందర్ కు మంచి గుర్తింపు ఉంది.కొన్ని వారాల క్రితం మహాలక్ష్మి గర్భవతి అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినా ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.మహాలక్ష్మి రవీందర్ లకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.మహాలక్ష్మి రవీందర్ జోడీ త్వరలో శుభవార్త చెప్పాలని అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.







