తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేస్తామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.ఇంటర్ స్టేట్ బార్డర్లలో ప్రతిక్షణం నిఘా చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోకి మావోయిస్టులు చొరబడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు.స్థానిక ప్రజల భాగస్వామ్యంతో కట్టడి చేస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని చెప్పారు.ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పోలీస్ శాఖకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.







