విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణలు ప్రారంభమైయ్యాయి.ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఈ దీక్షా విరమణల ప్రక్రియ కొనసాగనుంది.
ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు భవానీ దీక్షా విరమణలు పటిష్ట ఏర్పాట్లు చేశారు.అదేవిధంగా ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణకు అనుమతిని ఇస్తున్నారు.
భవానీల కోసం తాత్కాలిక షెడ్లతో పాటు కేశ ఖండన శాలలను ఏర్పాటు చేశారు.







