తప్పులు చేయటం సహజం.అది చిన్న తప్పయినా కానీ పెద్ద తప్పు అయినా కానీ తప్పు తప్పే.
ఏ తప్పు చేసిన దానిని కొందరు అంత త్వరగా ఒప్పుకోరు.మరి కొంతమంది మాత్రం తప్పు చేసిన వెంటనే ఒప్పేసుకుంటారు.
సామాన్యులే కాదు మంచి మంచి పలుకుబడిలో ఉన్న వాళ్లు కూడా తప్పులు చేయటం.ఒప్పుకోవడం.
వాటిని సరిదిద్దడం లాంటివి చేస్తుంటారు.అయితే తాజాగా సినీ నటి మంచు లక్ష్మి కూడా గతంలో తను కూడా తప్పుడు చేసినట్టు ఒప్పుకుంది.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి.
ఈమె తెలుగు ప్రేక్షకులతో తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.
అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.లక్ష్మి తొలిసారిగా ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.అలా పలు సినిమాలలో బాగా అవకాశాలు అందుకుంది.
హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేక స్టార్ హీరోయిన్ హోదా సొంతం చేసుకోలేక అవకాశాలు అందుకోలేకపోయింది.
కేవలం సినిమాలలోనే కాకుండా ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.టాలీవుడ్ బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం లో కూడా హోస్టింగ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఇక ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతో తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
అప్పుడప్పుడు తన అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.
అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయగా అందులో వీడియోలు కూడా పంచుకుంటుంది.
అలా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాతో మాత్రం దగ్గరగా ఉంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్ స్టాలో ఒక పోస్ట్ షేర్ చేసుకుంది.
ఇక అందులో ఏముందంటే.గతంలో కొన్ని చేశాను.
అవి ఇప్పుడు మార్చలేను.కానీ ఇప్పుడు నేను మారిపోయాను.
కాబట్టి ఆ తప్పులు మళ్ళీ చెయ్యను అని ఉండటంతోతను ఏదో తప్పును ఒప్పుకున్నట్లు అర్థమవుతుంది.అయితే ఆ తప్పేంటో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు లక్ష్మి.