కాళ్ళు మాత్రమే పోయాయి..ప్రాణం కాదు అని నిరూపించిన నటుడు నూతన్ ప్రసాద్

జీవితం లో ఏదైనా కావలి అనుకుంటే చేయడం ఎంత సేపు.మనం ఎప్పుడు కావాలంటే అప్పడు అనుకున్నది చేయచ్చు.

 Remembering Nuthan Prasad On His Birth Anniversary Details, Nuthan Prasad, Nutha-TeluguStop.com

చావు చివరి అంచున నిలబడ్డ కూడా మన ప్రయాణం ఆగాల్సిన అవసరం లేదు.అందుకే జీవితంలో అన్ని కోల్పోయిన వారికి కూడా మిగిలి ఉండేది ఒక్కటే అది భవిషత్తు.

జీవితం ముగిసిపోయింది, సర్వస్వము కోల్పోయాం, శూన్యం లో ఉన్నాం అనుకునేవారు కూడా ఒక అడుగు ముందుకు వేసి బ్రతకచ్చు అని నిరూపించిన వ్యక్తి నూతన ప్రసాద్. ఆయనకు సినిమా అన్ని ఇచ్చింది.

బోలెడన్ని అవకాశాలు, సమాజంలో మంచి గుర్తింపు, నూటొక్క జిల్లాల అందగాడిగా అందరి దృష్టిలో నిలిచిపోయాడు.అదే సినిమా అయన నుంచి అయన జీవితాన్ని లాగేసుకుంది.సర్వం కోల్పోయేలా చేసింది.బామ్మా మాట బంగారు బాట సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదం లో నడుము కింద బాగం తో పాటు రెండు కళ్ళను పోగొట్టుకున్నాడు.

ఆ క్షణం తర్వాత అయన జీవితంలో ఇంకా ఏమి మిగలలేదు అన్నట్టుగా అయిపొయింది పరిస్థితి.S/o సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్ ఓకే డైలాగ్ చెప్తాడు.” యాక్సిడెంట్ అంటే ఒక బైకో కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవడం” ఇది నూతన్ ప్రసాద్ కి సరిగ్గా సరిపోతుంది.

Telugu Nuthan Prasad, Bammamata, Nuthanprasad-Movie

అసలు ఏం జరిగింది.ఎందుకు జరిగింది.ఇది కల అయితే బాగుండు అని ఎన్నో వందల, వేళా సార్లు అనుకునే ఉంటారు.

అయితే ఆయన ఆ రోజుతో ఆగిపోతే మనం ఈ రోజు ఎందుకు మాట్లాడుకుంటాము.నూతన ప్రసాద్ అక్కడ నుంచి మళ్లి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాడు.అందుకే అయన నూటొక్క జిల్లాల అందగాడు అయ్యాడు.ఓడిపోయాడు అని అన్నవాళ్ళ నోటితోనే ఔరా అని అనిపించుకున్నాడు.

పూర్తిగా డిప్రెషన్ నుంచి కోలుకొని మళ్లి తెరపై కనిపించాగాడు.కోర్ట్ లో జడ్జి, డబ్బింగ్ చెప్పడం , కూర్చొని చేసే పాత్రలు పోషించడం చేసాడు.

అదే సమయంలో నేరాలు ఘోరాలు వంటివి కూడా చేసాడు.అయినా చివరి రోజుల్లో కాస్త కష్టంగానే అయన జీవితం ముగిసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube