కొత్త పిక్సెల్ ఫోన్ విడుదల చేయనున్న గూగుల్.. ఫీచర్లు ఇవే

గూగుల్ పిక్సెల్ ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది.ఇప్పుడు అంతా ఫోల్డబుల్ ఫోన్ల యుగం నడుస్తోంది.

 Google Pixel Foldable Phone Price And Features Details, Pixel Phone, Google, Tec-TeluguStop.com

దీంతో సరికొత్త పిక్సెల్ ఫోన్‌ను గూగుల్ మార్కెట్‌లోకి త్వరలో విడుదల చేయనుంది.అయితే దీనికి సంబంధించి కొన్ని ఫీచర్లు ఎలా ఉంటాయో లీక్ అయ్యాయి.

గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో దర్శనం ఇస్తున్నాయి.ఇందులో 5.9-అంగుళాల సెకండరీ డిస్‌ప్లే, 7.69-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని తేలింది.దీనిని చూడగానే ఒప్పో ఫైండ్ ఎన్ లాంటి నోట్‌బుక్ డిజైన్‌ దర్శనమిస్తోంది.వెనుక చూస్తే ప్యానెల్ పిక్సెల్ 7 ప్రో మాదిరిగానే ఉంటుందని నివేదికలు వెల్లడించాయి.

ఇక ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు కెమెరా సెన్సార్ల పక్కనే గూగుల్ ఎల్‌ఈడీ ఫ్లాష్, మైక్రోఫోన్‌ను కలిగి ఉంటుంది.ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షేడ్‌లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఇదే రంగును గత నెలలో జోన్ ప్రోసెర్ టిప్ చేశారు.పిక్సెల్ ఫోల్డ్‌లో టెన్సర్ G2 చిప్‌సెట్ అమర్చి ఉంటారని నివేదికలు సూచిస్తున్నాయి.

మామూలుగానే, గూగుల్ పిక్సెల్ బడ్స్ సేల్స్ పెంచడానికి గూగుల్ పిక్సెల్ ఫోన్లకు హెడ్‌ఫోన్ జాక్ ఉంచరు.

Telugu Google, Googlepixel, Pixel Phone, Ups-Latest News - Telugu

ఈ ఫోల్డబుల్ ఫోన్‌కు అదే తరహాలో జాక్ లేదని అర్థం అవుతోంది.ఈ ఫోన్‌లతో పెన్ను కూడా ఉండే అవకాశం ఉంది.సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ ఫోన్ ఆండ్రాయిడ్ ఎల్‌ ఆధారంగా పని చేయనుంది.

దీని బరువు 263 గ్రాములు ఉండే అవకాశం ఉంది.ఇందులో 12 జీబీ ర్యామ్‌ ఉండనుంది.

ఫోన్ ధర 1,799 డాలర్లు ఉండే అవకాశం ఉంది.అంటే భారత మార్కెట్‌లో ఇది దాదాపు రూ.1.45 లక్షల ధర ఉండవచ్చు.మే 2023లో దీనిని మార్కెట్‌లో విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube