బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఎస్ఎస్ రాజమౌళికి ఉందని చెప్పాలి.తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించిన రాజమౌళి తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఆదరణ సంపాదించుకున్న మనకు తెలిసిందే.ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
దర్శకుడుగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న రాజమౌళి తాజాగా కాంతార సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార సినిమా ఎలాంటి విజయాలను అందుకుందో మనకు తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమా గురించి ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.తాజాగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కాంతర సినిమా గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు.
ఇండస్ట్రీలో భారీ హీట్ అందుకోవాలంటే భారీ బడ్జెట్ తో సినిమాలు చేయాల్సిన పనిలేదని కాంతారా లాంటి చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలను అందుకుంటాయని తెలిపారు.ఇటీవల ఫిల్మ్ కంపానియన్ తో మాట్లాడుతూ ఈయన కాంతార సినిమా గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.

సినిమాలకు కలెక్షన్లను రాబట్టాలి అంటే పెద్ద ఎత్తున ఆ సినిమాలను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.భారీ బడ్జెట్ సినిమాలు చేయటానికి భారీ స్థాయి అవసరం లేదని, కాంతార వంటి చిన్న సినిమా కూడా భారీ కలెక్షన్లను సాధించాయని ఈయన తెలిపారు.బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు రావాలంటే ప్రమోషన్లు ముఖ్యం కాదు సినిమాలో కంటెంట్ ముఖ్యమని ఈ సందర్భంగా రాజమౌళి కాంతార సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.