టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతిభ ఉన్న నటులలో చిరంజీవి ఒకరు.ప్రస్తుతం చిరంజీవి సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ రిలీజ్ కానుంది.
చిరంజీవి కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి కావడం గమనార్హం.
ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ చంద్రమోహన్ చిరంజీవి గురించి చేసిన కామెంట్లపై స్పందిస్తూ ఆ విషయాలను నేను అంగీకరించనని ఆయన తెలిపారు.
చిరంజీవి లేకపోతే అల్లు అరవింద్ ఎక్కడ అని ఇమంది రామారావు అన్నారు.బంగారం గొప్పదా లేక బంగారం తయారు చేసే వ్యక్తి గొప్పవాడా అనే ప్రశ్నకు బంగారం గొప్పదనే సమాధానం వినిపిస్తుందని ఆయన తెలిపారు.
డ్యాన్స్ కు చిరంజీవి పెట్టింది పేరు అని ఆయన తెలిపారు.చిరంజీవి వల్ల అల్లు అరవింద్ కు పేరు వచ్చిందని ఇమంది రామారావు అన్నారు.
అల్లు అరవింద్ కు ఈ స్థితి రావడానికి కారణం చిరంజీవి అని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని ఇమంది రామారావు చెప్పుకొచ్చారు.
సినిమా ఇండస్ట్రీలో ఒక కులం హీరోలే సక్సెస్ అయ్యారని చెప్పడం కరెక్ట్ కాదని ఆయన కామెంట్లు చేశారు.

చిరంజీవి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారని ఆ క్రెడిట్ మరో వ్యక్తికి ఇవ్వడం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు.చిరంజీవి రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి పారితోషికం కూడా అంతకంతకూ పెరుగుతోందని బోగట్టా.