Priyanka Jawalkar Balakrishna: బాలయ్యతో నటించాలా ? వద్దా ? కన్ఫ్యూజన్ లో టాక్సీవాలా బ్యూటీ!

సినీ ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఫీల్డ్ అనే విషయం తెలిసిందే.ఇక్కడ ఎప్పుడు ఎవరికీ అవకాశం వరిస్తుందో చెప్పలేం.

 Priyanka Jawalkar To Play As Lead In Nbk 108 Details, Nbk107, Anil Ravipudi , Ba-TeluguStop.com

ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఎవరికీ ఎప్పుడు లక్ కలిసి వస్తుందో చెప్పలేం.కొంత మందికి ఎంత టాలెంట్ ఉన్న వారికీ అవకాశం రావడానికి సమయం పడుతుంది.

ఇంకొంత మందికి మాత్రం లక్ కలిసి వస్తే వెంటనే అవకాశాలు వరిస్తాయి.

మరి ఇప్పుడు ఒక బ్యూటీ పరిస్థితి కూడా ఇలానే ఉంది.

విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ప్రియాంక జవల్కర్. ఈ సినిమా హిట్ అయ్యింది.

మొదటి సినిమాతోనే ఈ అమ్మడు యూత్ ను బాగానే ఆకట్టుకుంది.అయితే ఈ సినిమా విజయంతో ఈ అమ్మడికి వరుస అవకాశాలు వస్తాయి అనుకున్నారు.

కానీ అది జరగలేదు.చిన్న చిన్న సినిమాలు చేస్తున్న గుర్తింపు మాత్రం పొందలేదు.

అందం, అభినయం అన్ని ఉండి స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు ఉన్న ఈ అమ్మడికి లక్ కలిసి రాలేదు.కానీ తాజాగా ఈ అమ్మడికి బాలయ్య 108వ సినిమాలో ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

Telugu Anil Ravipudi, Balakrishna, Nbk-Movie

దీంతో ఈ సినిమా ఆఫర్ తో ఈ అమ్మడి లక్ మారుతుంది అని అనుకుంటున్నారు.అయితే ఈ అమ్మడు ఈ ఆఫర్ రాగానే ఓకే చెప్పిన ఆ తర్వాత ఆలోచనలో పడిందట.బాలయ్య లాంటి సీనియర్ హీరోతో సినిమా చేస్తే యంగ్ హీరోల సరసన ఛాన్సులు రాకపోవచ్చు అనే టాక్ వస్తుంది.ఈమె కు తన కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనే ఆలోచనలో ఉందట.

మరి ఈమెకు ఈ అవకాశం ఎలా మారుతుందో చూడాలి.ఇక బాలయ్య 108వ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు.ఇందులో శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తుంది.

త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube