బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాప్ అబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న విషయం తెలిసింది.ఇలా అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ కార్యక్రమం సీజన్ 2 నాలుగవ ఎపిసోడ్ లో భాగంగా ప్రముఖ నిర్మాతలైనటువంటి అల్లు అరవింద్ సురేష్ బాబు డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు వంటి వారందరూ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాల గురించి ఎన్నో విషయాలను ప్రస్తావించిన వీరందరూ థియేటర్ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ థియేటర్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.ఆధునికీకరణ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారని తెలిపారు.థియేటర్ వ్యవస్థ పడిపోతున్న సమయంలో థియేటర్ యజమానులు థియేటర్ వ్యవస్థను పైకి తీసుకురావాలని అలాగే సినిమాలను కొనుక్కొని విడుదల చేయాలంటే ఎంతో భారంగా మారింది.దీనిని భరించలేనటువంటి థియేటర్ యజమానులు థియేటర్లను మీరే నడుపుకోండి సంవత్సరానికి మాకు ఎంతో కొంత చెల్లించండి అంటూ థియేటర్ యజమానులు నిర్మాతలను కోరారని అల్లు అరవింద్ తెలిపారు.

ఇలా థియేటర్లను మేము తీసుకొని వాటికి కోట్ల రూపాయల ఖర్చు చేసి వాటిని అన్ని వసులతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దామని ఇలా థియేటర్లను ఆధునికరించడం వల్లే ప్రేక్షకులు సినిమాలను చూడటానికి థియేటర్లకు రావడంతో వసూళ్లు పెరుగుతున్నాయని, మీలాంటి పెద్ద హీరోలకి అవకాశాలు ఇవ్వగలుగుతున్నాం అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ థియేటర్ వ్యవస్థ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణతో ఓ మల్టీ స్టార్ చేయాలనీ ఉందంటూ చెప్పడం విశేషం.