జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతలు ఓవరాక్షన్ చేశారు.జగిత్యాల తహశీల్దార్ కార్యాలయం దగ్గర చేపట్టిన రైతు ధర్నాలో రైతుపై దాడికి పాల్పడ్డారు.
ఆస్పత్రికి వెళ్తున్న రైతు దంపతులపై పార్టీ కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం.ఆస్పత్రికి వెళ్తున్నామన్నా వినకుండా రైతును కొట్టి చొక్కాను చింపివేశారు.
దీంతో తన భర్తను కొట్టొద్దని భార్య మొర పెట్టుకుంది.కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎదురుగానే రైతుపై పార్టీ కార్యకర్తలు దాడికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకుని రైతును అక్కడి నుంచి పంపించేశారు.